విప్లవ పరిస్థితిపై అతివాదం.. యుద్ధం వస్తే చాలు.. విప్లవం వచ్చినట్టే!
దేశంలో నెలకొన్న విప్లవ పరిస్థితి, ప్రజల సంసిద్ధత విషయంలో నక్సలైట్ పార్టీలు.. ముఖ్యంగా అప్పటి పీపుల్స్‌వార్ నుంచి ఇప్పటి మావోయిస్టు పార్టీ వరకు అతివాద అంచనాలు వేశాయనే వాదన మొదటినుంచీ ఉంది. నక్సల్బరీ నిర్మాత, దేశంలో మార్క్సిస్టు-లెనినిస్టు రాజకీయాలకు ఆద్యుడు చారుమజుందార్‌తో మొదలైన ఈ అతివాద పోకడలు.. స్థల, కాల పరిస్థితులు ఎంతగా మారినా ఇసుమంతైనా మారలేదు. 1967 తర్వాతి కాలంలో చారుబాబు దేశంలో అత్యద్భుతమైన విప్లవ పరిస్థితి ఉందని, మనం చిన్న నిప్పుకణిక రగిలిస్తే చాలు…..
