అన్నల రాజ్యం-2: నాలుగు జిల్లాల్లో సమాంతర సర్కార్లు!
(ఛత్తీస్‌గఢ్ అడవుల నుంచి డి మార్కండేయ) కటిక చీకట్లలో కడు పేదరికంతో కూడు, గూడు, గుడ్డ కరువైన దీనస్థితిలో బతుకుతున్న బస్తర్ ఆదివాసులకు 1980లలో ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రవేశించిన నక్సలైట్లు దేవుళ్లలా కనిపించారు. అభివృద్ధి పేరుతో అటవీ సంపదను, ఖనిజ వనరులను దోచుకెళుతున్న ప్రభుత్వాలు స్థానిక ప్రజలకు చేస్తున్నదేమీ లేదని అన్నలు చెప్పిన మాటలను మొదట వాళ్లు నమ్మలేదు. అయితే కాలక్రమంలో పాలకుల పట్టించుకోనితనం, అటవీ సిబ్బంది అరాచకాలు, కాంట్రాక్టర్ల, షావుకార్ల దోపిడి వారిని మావోయిస్టులకు దగ్గర…
