లౌకికవాదులు కేసీఆర్ వెనకే చేరాలా?
మునుగోడు ఉపఎన్నికలో అధికార టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి మద్దతు ప్రకటిస్తూ సీపీఐ, సీపీఎం చేసిన ప్రకటన రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. మతోన్మాద, నియంతృత్వ, ఫాసిస్టు బీజేపీని ఓడించడమే లక్ష్యంగా జాతీయ పార్టీ చేసిన తీర్మానం మేరకు, రాష్ట్ర స్థాయిలో సైతం ఆ పార్టీ వ్యతిరేక వైఖరి తీసుకుంటున్నట్లు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి (అప్పటికి) చాడ వెంకట్‌రెడ్డి ఆగస్టు 20న ప్రకటించారు. బీజేపీని ఓడించగలిగే సత్తా టీఆర్ఎస్‌కు మాత్రమే ఉన్నందున ఆ పార్టీకి మద్దతు ఇస్తున్నట్లు తెలిపారు. ఈ…
