వలస చట్టాలు తిరగరాయండి!
రాజద్రోహ చట్టం అమలుపై గత బుధవారం దేశ అత్యున్నత న్యాయస్థానం చరిత్రాత్మక నిర్ణయాన్ని వెలువరించింది. ఇండియన్ పీనల్ కోడ్ (ఐపీసీ)లోని సెక్షన్ 124-ఎ రూపంలో కొనసాగుతున్న ఈ చట్టం అమలును వెంటనే నిలిపివేయాలని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ హిమా కోహ్లితో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఆదేశాలిచ్చింది. ఈ సెక్షన్ కింద తాజాగా ఎఫ్ఐఆర్‌లు నమోదు చేయవద్దని, ఇప్పటికే పెట్టిన కేసుల విచారణను, తదుపరి చర్యలను నిలిపివేయాలని కేంద్రంతోపాటు అన్ని రాష్ట్ర…
