కమల‘బంధం’లో తెలంగాణ
మూడు రోజులుగా కాషాయ జెండాలతో తెలంగాణ రెపరెపలాడిపోతోంది. జాతీయ కార్యవర్గ సమావేశాలలో పాల్గొనడానికి వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన బీజేపీ ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, ఎంపీలు, పార్టీ పదాధికారులు దాదాపు అన్ని నియోజకవర్గాలలో పర్యటించారు. మోడీ పాలనను పొగుడుతూ, కేసీఆర్ నియంతృత్వ వైఖరిని తూలనాడుతూ ఉద్వేగపూరిత ప్రసంగాలు చేశారు. సమావేశాలు జరుగుతున్న రాజధాని హైదరాబాద్లో అయితే హడావుడి ఆకాశాన్నంటేలా ఉంది. నగర కూడళ్లలో, రోడ్లపై ఎక్కడ చూసినా బీజేపీ అగ్రనేతలను స్వాగతిస్తూ కట్టిన ఫ్లెక్సీలే దర్శనమిస్తున్నాయి. అధికార…
