అన్నలరాజ్యం-3: విముక్తి ప్రాంతాలు ఏర్పాటుచేస్తారా?

(ఛత్తీస్‌గఢ్ అడవుల నుంచి డి మార్కండేయ) ఎమర్జెన్సీ తదనంతరం కేంద్ర ఆర్గనైజర్ల రూపంలో రైతాంగాన్ని, యువతీ యువకులను ప్రజాసంగాల్లోకి సమీకరించిన నక్సలైట్లు ఆ తర్వాత క్రమంగా తమ నిర్మాణాలను పరిస్థితులకనుగుణంగా మార్చుకున్నారు. భూస్వాముల, గూండాల దాడుల నుంచి రక్షణ కోసం ఒక ఆర్గనైజర్, ఇద్దరు సభ్యుల (1+2) పద్ధతిని అమల్లోకి తెచ్చారు. ఆ సభ్యుల వద్ద తపంచాలు, నాటుబాంబులు ఉండేవి. ఆత్మరక్షణ కోసం పోలీసు బలగాలపై సైతం దాడి చేయాలని నిర్ణయించిన నేపథ్యంలో 1985 నుంచి ఐదుగురి…

Read More

అబూజ్‌మాడ్‌లో ఏం జరుగుతోంది?

సెరిబ్రల్ మలేరియాతో తెహెల్కా ఫొటోగ్రాఫర్ తరుణ్ శెహ్రావత్ మరణించడంతో అబూజ్‌మాడ్ ప్రాంతం మరోసారి వార్తల్లోకెక్కింది. మహిళా జర్నలిస్టు తుషా మిట్టల్‌తో కలిసి గత ఏప్రిల్‌లో శెహ్రావత్ మాడ్ కొండల పైకి వెళ్లారు. వారం రోజుల పాటు తిరిగి అక్కడ జరుగుతున్నదేమిటో తెలుసుకుని బయటకు వచ్చారు. మాడ్ వాసుల జీవన పరిస్థితులు, మావోయిస్టుల నేతృత్వంలో ఏర్పడిన జనతన సర్కార్లు, వారికి పోలీ సు బలగాలకు మధ్య జరుగుతున్న యుద్ధం, తదితర అంశాలకు సంబంధించిన విలువైన సమాచారం మోసుకువచ్చారు. అయితే,…

Read More

బస్తర్.. భారత యేనాన్..

‘‘దండకారణ్యం భారతదేశంలోని అరుణారుణ ప్రాంతం నుంచి ఢిల్లీకి తిరిగివస్తుంటే.. నాకు డెబ్బై ఐదు సంవత్సరాల కిందట ఉత్తర షాంగ్సీ లోని యేనాన్ నుంచి కొమింగ్‌టాంగ్ రాజధాని సియాన్‌కు తిరిగివచ్చినట్లనిపించింది. కానీ నేనక్కడ నాలుగు నెలలు గడిపి రాలేదు. కేవలం రెండు వారాలు మాత్రమే ఉన్నాను. చైనా విప్లవ కేంద్రమైన పొడి వాతావరణపు ఉత్తర షాంగ్సీకీ, ఇవాళ్టి భారత విప్లవ కేంద్రమైన దండకారణ్యానికీ, బస్తర్ అడవులకూ తేడాలు ఎన్నైనా ఉండవచ్చు. ప్రస్తుత పోరాటపు పర్యవసానం ఏమైనా కావచ్చు..’’ భారత…

Read More

నేపాల్ సైన్యంలో మావోయిస్టులు

ప్రపంచంలో ఇదివరకు ఎక్కడా జరగని అద్భుతం ఇప్పుడు నేపాల్లో ఆవిష్కృతమవుతోంది. దశాబ్దం పాటు ఒకరినొకరు చంపుకునే పనిలో నిమగ్నమై కనీసం 13వేల ప్రాణాలు బలికావడానికి కారణమైన వైరి పక్షాలు త్వరలో ఒకే సంస్థలో కదం కదం కలిపి దేశరక్షణ విధులను నిర్వర్తించబోతున్నాయి. యునిఫైడ్ కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ నేపాల్(మావోయిస్టు) నేతృత్వంలోని పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎస్ఏ)కి చెందిన తొమ్మిది వేల మందికి పైగా గెరిల్లా సైనికులు ప్రభుత్వ సైన్యంలో భాగమయ్యే ప్రక్రియ ఇటీవల అక్కడ మొదలైంది. ఇందుకోసం…

Read More

అబూజ్‌మాడ్‌పై దాడి-2: సైన్యాన్ని దించుతారా..?

(డి మార్కండేయ) దట్టమైన అడవులు, ఎత్తైన కొండలు, లోతైన లోయలతో దుర్భేద్యమైన బెర్రయిన్‌ను కలిగివున్న అబూజ్మడ్ ప్రాంతంపై దాడి చేయడమంటే మాటలు కాదు. ఏ దారి ఎటు వెళుతుందో, ఏ పల్లె ఎక్కడుందో, ఎక్కడ ఏ వాగు అడ్డం తగులుతుందో, ఏ వ్యక్తి ఏ ఊరికి చెందినవాడో, ఏ మూలన ఏ ప్రమాదం పొంచివుందో స్థానిక ఆదివాసులకు తప్ప బయటి వారికి అసలే తెలియని ప్రాంతమిది.. ఎక్కడికి చేరాలన్నా కాలినడక తప్ప మరో మార్గం లేదు. సముద్రమట్టానికి…

Read More

అబూజ్‌మాడ్‌పై త్వరలో సైనిక దాడి..?

(డి మార్కండేయ) మావోయిస్టులు గెరిల్లా స్థావరంగా ప్రకటించుకున్న అబూజ్మడ్ ప్రాంతంపై త్వరలో భారీ ఎత్తున సైనిక దాడి జరగనుందని తెలుస్తోంది. కేంద్ర హోం శాఖ ఆధ్వర్యంలో ఛత్తీస్‌గఢ్ పోలీసులు ఈ మేరకు అన్ని ఏర్పాట్లూ చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఉన్న కేంద్ర బలగాలకు తోడు మరిన్ని బలగాలను పంపించాల్సిందిగా ఆ రాష్ట్ర ప్రభుత్వం చేసిన అభ్యర్థనకు యూపీఏ సర్కారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. ఇప్పటివరకూ ఎలాంటి సర్వే జరగని ఈ అబూజ్మడ్ కొండల ప్రాంతాన్ని…

Read More