అన్నలరాజ్యం-3: విముక్తి ప్రాంతాలు ఏర్పాటుచేస్తారా?
(ఛత్తీస్గఢ్ అడవుల నుంచి డి మార్కండేయ) ఎమర్జెన్సీ తదనంతరం కేంద్ర ఆర్గనైజర్ల రూపంలో రైతాంగాన్ని, యువతీ యువకులను ప్రజాసంగాల్లోకి సమీకరించిన నక్సలైట్లు ఆ తర్వాత క్రమంగా తమ నిర్మాణాలను పరిస్థితులకనుగుణంగా మార్చుకున్నారు. భూస్వాముల, గూండాల దాడుల నుంచి రక్షణ కోసం ఒక ఆర్గనైజర్, ఇద్దరు సభ్యుల (1+2) పద్ధతిని అమల్లోకి తెచ్చారు. ఆ సభ్యుల వద్ద తపంచాలు, నాటుబాంబులు ఉండేవి. ఆత్మరక్షణ కోసం పోలీసు బలగాలపై సైతం దాడి చేయాలని నిర్ణయించిన నేపథ్యంలో 1985 నుంచి ఐదుగురి…
