మునుగోడు బైపోల్.. క్యా సీన్ హై..!

మునుగోడులో ఏం జరగనుందనే విషయం పైనే ఇప్పుడు రాష్ట్రమంతటా చర్చ జరుగుతోంది. అక్కడి పరిస్థితి టీఆర్ఎస్, బీజేపీ మధ్యలో నువ్వా? నేనా? అన్నట్టు ఉందని అంటున్నారు. మూడవ స్థానానికి పడిపోయిన కాంగ్రెస్, బహుజన వాద బీఎస్పీ ఎవరి ఓట్లను ఎక్కువ చీల్చితే ఆ పార్టీ ఓడిపోతుందని అంచనా వేస్తున్నారు. ఎవరు గెలిచినా స్వల్ప మెజారిటీయే వస్తుందని, ఆఖరు నిమిషం వరకూ ఉత్కంఠ కొనసాగనుందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో మునుగోడులో ఓటర్ల మూడ్ ఎలా ఉందో తెలుసుకోవడానికి మా…

Read More
G SAT

జీశాట్‌–24 ఉపగ్రహ ప్రయోగం విజయవంతం

ఫ్రెంచ్‌ గయానా కౌరూ అంతరిక్ష కేంద్రం నుంచి ప్రయోగించిన జీశాట్‌–24 కమ్యూనికేషన్‌ ఉపగ్రహాం నిర్దేశిత కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశపెట్టారు. ఏరియన్‌–5 రాకెట్‌ ద్వారా న్యూ స్పేస్‌ ఇండియా లిమిటెడ్‌, కేంద్ర ప్రభుత్వం.. డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ స్పేస్‌(డీఓఎస్‌) సంయుక్తంగా రూపాందించిన జీశాట్‌–24 ఉపగ్రహాన్ని బుధవారం విజయవంతంగా రోదసిలోకి ప్రవేశపెట్టారు. ఈ ఉపగ్రహం 4,180 కిలోల బరువు.. 24 కేయూ బ్యాండ్‌ ట్రాన్స్‌ఫాండర్లు అమర్చి డీటీహెచ్‌ అప్లికేషన్‌ అవసరాలను తీర్చేందుకు పాన్‌ ఇండియా కవరేజీతో రోదసీలో పంపారు. ఈ ఉపగ్రహాం…

Read More

కేసీఆర్‌లో ఓటమి భయం మొదలైందా?

  దిశ, వెబ్‌డెస్క్: ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ @పీకేతో అధికార టీఆర్ఎస్ చేసుకున్న ఒప్పందం గురించే ఇప్పుడు తెలంగాణలో చర్చ నడుస్తోంది. నటుడు ప్రకాశ్‌రాజ్‌తో కలిసి పీకే ఇటీవల గజ్వేల్ నియోజకవర్గంలో రహస్యంగా పర్యటించడం, కేసీఆర్ సర్కారు పాలనపై, పథకాలపై ప్రజల ఫీడ్‌బ్యాక్ తీసుకోవడం, మల్లన్నసాగర్‌ను సందర్శించడం మీడియా దృష్టిని ఆకర్షించింది. బిహార్‌కు చెందిన పీకే తనవైన వ్యూహాలతో 2012 గుజరాత్ ఎన్నికల్లో ప్రస్తుత ప్రధాని మోడీని మూడోసారి ముఖ్యమంత్రిగా గెలిపించి మొదటిసారి వార్తల్లో నిలిచారు….

Read More

ముందస్తా? పుత్రాభిషేకమా?

తెలంగాణ అంతటా ఇప్పుడు ముందస్తు ఎన్నికల చర్చే నడుస్తోంది. గత నాలుగు నెలల నుంచీ తన దాడిని కమలనాథులపై ఎక్కుపెట్టిన సీఎం కేసీఆర్ ఈ మధ్య తీవ్రత బాగా పెంచారు. ఈ నెల ఒకటిన కేంద్రం పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజు ప్రధానిని, ప్రభుత్వ పాలనను, బీజేపీని ‘తిట్టిన తిట్టు తిట్టకుండా’రెండున్నర గంటల పాటు తిట్టిపోశారు. వారం తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన, తెలంగాణ ఏర్పాటు జరిగిన తీరుపై రాజ్యసభలో మోడీ చేసిన వ్యాఖ్యలు ఆయన మరోసారి…

Read More

కేటీఆర్ టైం వచ్చేసింది!

తెలంగాణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డి బాధ్యతలు తీసుకున్న నేపథ్యంలో రాష్ట్రంలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. పల్లెలు, పట్టణాల నుంచి మొదలుకొని రాజధాని వరకు ఆ పార్టీ శ్రేణులలో ఎక్కడలేని జోష్ వచ్చింది. ముందు కినుక వహించిన నేతలు కూడా చివరకు ప్రమాణస్వీకారానికి వచ్చి ఆయనకు మద్దతుగా నిలబడ్డారు. తెలంగాణ తల్లి సోనియమ్మేనంటూ రేవంత్ చేసిన ప్రసంగం కార్యకర్తలలో కొత్త ఉత్సాహం తెచ్చింది. ఒకరకంగా వచ్చే శాసనసభ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ సైరన్ ఊదిన సంకేతాలు…

Read More

ఉద్యమాలకు, రాజకీయాలకు సంబంధం లేదా?

ఇటీవలే రాష్ట్ర కేబినెట్ నుంచి బర్తరఫ్ అయిన ఈటల రాజేందర్ మీడియాతో మాట్లాడుతూ ఓ విషయం చెప్పారు. కేసీఆర్‌కు ఇప్పుడు ఉద్యమబంధాలు లేవని, కేవలం రాజ్యం, రాజ్యానికి సంబంధించిన లక్షణాలే ఉన్నాయని అన్నారు. 2014 వరకే ఉద్యమమని, ఆ తర్వాత టీఆర్‌ఎస్ ఫక్తు రాజకీయ పార్టీగా మారిందని వివరించారు. స్వయానా సీఎం కేసీఆర్ కూడా అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత అనేకమార్లు ఈ విషయాన్ని స్వయంగా నొక్కి చెప్పారు. గొప్ప ఉద్యమం చేసిన టీఆర్ఎస్ తన ప్రత్యేక…

Read More